అయోధ్యకు రండి.. పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది.

By Medi Samrat
Published on : 3 Jan 2024 8:15 PM IST

అయోధ్యకు రండి.. పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది. బుధవారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కి ఆహ్వాన పత్రిక అందించారు ఆర్.ఎస్.ఎస్. ప్రాంత సంపర్క ప్రముఖ్ ముళ్లపూడి జగన్. ఈ భేటీలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస రెడ్డి, ఆర్.ఎస్.ఎస్.కార్యాలయ ప్రముఖ్ పూర్ణ ప్రజ్ఞ కూడా పాల్గొన్నారు. ఆహ్వాన పత్రిక అందించి అయోధ్య రామ మందిర నిర్మాణ విశేషాలు పవన్ కళ్యాణ్ కు తెలిపారు.

జనవరి 22న ఆయోద్యలో రామ మందిర ప్రారంభానికి పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులను ఆహ్వానించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు కూడా అయోధ్య నుంచి ఆహ్వానం అందింది. రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి రజనీకాంత్ ను ఆహ్వానించినట్లుగా బీజేపీ నాయకుడు రా.అర్జునమూర్తి తెలిపారు. జనవరి 22న అయోధ్యలో రామ మందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. అయోధ్యలోని రామ మందిర ఆలయంలో రామ్‌‌ లల్లా పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారయ్యింది. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు రాముడి పట్టాభిషేక కార్యక్రమం జరగనుంది.

Next Story