పన్నుల పెంపుకు కూడా ఆ పేర్లు పెట్టుకోండి : జీవీఎల్ సెటైర్లు

GVL Slams AP Govt. ఏపీలో పన్నుల పెంపుదలకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని బీజేపీ నేత, రాజ్య‌స‌భ

By Medi Samrat  Published on  16 Jun 2021 1:14 PM GMT
పన్నుల పెంపుకు కూడా ఆ పేర్లు పెట్టుకోండి : జీవీఎల్ సెటైర్లు

ఏపీలో పన్నుల పెంపుదలకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని బీజేపీ నేత, రాజ్య‌స‌భ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడా పన్నుల పెంపుపై ఆదేశాలు ఇవ్వలేదని.. ఒక‌వేళ ఆదేశాలు ఇచ్చిన‌ట్ల‌యితే అన్ని రాష్ట్రాలు అమలు చేయాలికదా? అని అన్నారు. బీజేపీ పాలిత గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లలో ఆస్థి పన్నులు పెంచలేదు. అప్పులు తీర్చుకొనేందుకు పన్నులు పెంచి కేంద్రంపై నింద మోపుతారా అని వైసీపీ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు.

కేంద్రానికి.. పన్నుల పెంపుకు సంబంధం లేదు. పన్నుల భారంతో ఆర్జన మీకు, అపనింద కేంద్రానికా? అని ప్ర‌శ్నించారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలన్నింటికీ మీ స్టికర్లు వేసుకొని, పన్నుల నిర్ణయాన్ని కేంద్రానికి ఆపాదిస్తారా? ఎంత మోసం? అప్పులు చేసి పన్నులు వేసేది ఏపీ ప్రభుత్వం.. అపవాదులు కేంద్ర ప్రభుత్వానికా? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. పన్నుల పెంపుకు కూడా.. జగనన్న గిచ్చుడు, జగనన్న బాదుడు పథకం అని పేరు పెట్టుకోండని సెటైర్లు వేశారు.

పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం చేసింది శూన్యం. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి అంత కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారానే జ‌రుగుతుంద‌ని జీవీఎల్ అన్నారు. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ప్రాజెక్టు కింద ఏపీకి రూ. 8.16లక్షల కోట్ల నిధులు పెట్టుబడులు పెట్టడం జరుగుతోంది. స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్ కింద ఏపీకి నిధులు ఇచ్చాము. పియమ్ఏవై కింద రాష్ట్రానికి నిధులు కేటాయిస్తే జగనన్న కాలనీలు అని మీ పేరు పెట్టుకొని ప్రచారం చేసుకుంటారా అని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పన్నుల పెంచుతూ ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలని.. లేకపోతే బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఈ నిరసనను తీవ్రతరం చేసి ప్రజల సహాయ నిరాకరణ కార్యక్రమంగా చెప్పటం జరుగుతుందని జీవీఎల్ అన్నారు


Next Story