ఇబ్రహీంపట్నంలో రెండు గ్రూపుల మ‌ధ్య గొడ‌వ‌.. గ్యాంగ్ వార్ త‌ర‌హాలో..

Two groups clash in Andhra Pradesh. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో గ్యాంగ్ వార్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ

By Medi Samrat  Published on  2 Aug 2021 4:13 PM IST
ఇబ్రహీంపట్నంలో రెండు గ్రూపుల మ‌ధ్య గొడ‌వ‌.. గ్యాంగ్ వార్ త‌ర‌హాలో..

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో గ్యాంగ్ వార్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఇబ్రహీంపట్నం హైవే పక్కనే యువకుల ఘర్షణకు దిగారు. పిడిగుద్దులతో.. కర్రలతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో ఓ యువకుడు చనిపోయాడని.. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. విజయవాడ నుంచి వచ్చిన కొందరు యువకులు.. స్థానిక యువకులతో గొడవ పడ్డారని తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని జూపూడి గ్రామ శివారులో డాక్టర్ ఎన్టీటిపీస్ బూడిద కరకట్ట నుండి మురుగు నీరు వాటర్ ఫాల్స్ తరహాలో వస్తుంటుంది.

ఇటీవల కాలంలో కొంతమంది యువకులు అక్కడికి వస్తున్నారని.. సరదాగా నీటిలో ఆడుతూ ఉంటారని స్థానికులు తెలిపారు. ఆదివారం నాడు ఫ్రెండ్‌షిప్ డే, ఆదివారం కావడంతో యువకులు ఎక్కువ సంఖ్యలో అక్కడికి వచ్చారు. అయితే ఊహించని విధంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. చిన్న పాటి ఘర్షణ కాస్తా.. కొట్టుకునే స్థాయికి చేరింది. ఈ దారుణ ఘటన సాయంత్రం 5:00 గంటల సమయంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పోలీసుల రాకను చూసిన యువకులు పరారయ్యారు. ఈ యువకుల దాడి చేసుకుంటున్న సమయంలో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ ఘ‌ట‌న‌లో ఇబ్రహీంపట్నం గ్యాంగ్ వార్ కేసులో పది మంది అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ హనుమంతరావు తెలిపారు. గ్యాంగ్ వార్ సభ్యుల గాలించ‌డం కోసం పోలీసులు రెండు బృందాలు ఏర్పాటుచేశామ‌ని పేర్కొన్నారు. చిట్టినగర్, పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లోని గంజాయి స్థావరాల వద్ద పోలీసులు గాలిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇబ్రహీంపట్నం లో జరిగింది గ్యాంగ్ వార్ కాదని.. సంఘటనలో పాత నేరస్తులు ఎవరూ లేరని.. ఒక్కరు కూడా చనిపోలేదని.. అక్కడ స్థానికులు ఎవరూ లేరని.. అందరూ విజయవాడలోని నున్న, ప్రకాష్ నగర్, సింగ్ నగర్ కు చెందిన వారేన‌ని ఏసీపీ హనుమంతరావు అన్నారు.





Next Story