జూదాన్ని రాష్ట్రక్రీడగా మార్చివేశారు.. కూటమి సర్కార్‌పై వైసీపీ విమర్శలు
ఏపీలో కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్ష వైసీపీ విమర్శలు గుప్పించింది. సంప్రదాయం ముసుగులో జూదాన్ని రాష్ట్ర క్రీడగా మార్చేశారని ఎద్దేవా చేసింది.
By Knakam Karthik Published on 16 Jan 2025 12:31 PM ISTజూదాన్ని రాష్ట్రక్రీడగా మార్చివేశారు.. కూటమి సర్కార్‌పై వైసీపీ విమర్శలు
ఏపీలో కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్ష వైసీపీ విమర్శలు గుప్పించింది. సంప్రదాయం ముసుగులో జూదాన్ని రాష్ట్ర క్రీడగా మార్చేశారని ఎద్దేవా చేసింది. సంక్రాంతి రోజుల్లో కూటమి నాయకులు దగ్గరుండి మరీ ప్రతి గ్రామంలోనూ జూదం, కోడి పందేలు నిర్వహించారని ఆరోపించింది. ప్రతి బరి నుంచి భారీగా కమీషన్లు వసూలు చేస్తూ నాయకులు బాగుపడగా, జూదంలో డబ్బులు పోయిన వాళ్లు, ఒట్టి చేతులతో ఇళ్లకు వెళ్తున్నారంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ప్రజలు ఏమైపోతేనేం తాము బాగుపడితే చాలన్నది సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లక్ష్యంగా ఉందని తన ఎక్స్ అకౌంట్‌లో వైసీపీ ట్వీట్ చేసింది.
సంప్రదాయం ముసుగులో జూదాన్ని రాష్ట్రక్రీడగా మార్చేశారు. సంక్రాంతి రోజుల్లో కూటమి నాయకులు దగ్గరుండి మరీ ప్రతిఊళ్లోనూ జూదం.. కోడి పందేలు నిర్వహించారు. ప్రతి బరి నుంచీ భారీగా కమీషన్లు వసూలు చేస్తూ నాయకులు బాగుపడగా జూదంలో డబ్బులు పోయినవాళ్ళు ఒట్టిచేతులతో ఇళ్లకు వెళ్తున్నారు. ప్రజలు… pic.twitter.com/m5j3T6kdXX
— YSR Congress Party (@YSRCParty) January 16, 2025
సంక్రాంతి సందర్భంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెంలో జరిగిన కోడి పందేల్లో ఓ కోడి ఏకంగా రూ.1.25 కోట్లు గెలిచినట్లు ప్రచారం జరిగింది. డింకీ పందెంలో రసంగిపై అబ్రాస్ జాతి కోడి గెలిచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతి కోడి పందేలు జాతరను తలపించాయి. కొబ్బరి తోటల్లో, మామిడి తోటల్లో పెద్ద ఎత్తున కోడి పందేల బరులు దర్శనమిచ్చాయి. ఒక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే వేల సంఖ్యకు పైగా బరుల్లో కోడి పందేలు జరిగినట్లు తెలుస్తోంది.