అప్పుడు కేసులైన వారు నిలుచోండి.. ప‌వ‌న్‌తో స‌హా ఎమ్మెల్యేలంతా స్కూల్‌ పిల్ల‌ల్ల లేచారు..!

వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు ఉన్న వారు నిలుచోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన‌డంతో.. దాదాపు అసెంబ్లీలో సగం మందికి పైగా ఎమ్మెల్యేలు లేచి నిల్చున్నారు

By Medi Samrat  Published on  25 July 2024 4:12 PM IST
అప్పుడు కేసులైన వారు నిలుచోండి.. ప‌వ‌న్‌తో స‌హా ఎమ్మెల్యేలంతా స్కూల్‌ పిల్ల‌ల్ల లేచారు..!

వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు ఉన్న వారు నిలుచోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన‌డంతో.. దాదాపు అసెంబ్లీలో సగం మందికి పైగా ఎమ్మెల్యేలు లేచి నిల్చున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా లేచి నిలబడ్డారు. చుట్టూ ఉన్న వాళ్లను చూస్తూ పవన్ కళ్యాణ్ నవ్వుతూ ఉండడం విశేషం. టీడీపీ నేతలను జైల్లో వేసి బయటకు రానివ్వకుండా చేయాలని వైసీపీ ప్రభుత్వం చూసిందని.. అయితే ప్రజలు అద్భుతమైన తీర్పుతో ఏకంగా అసెంబ్లీకి పంపించారని చంద్రబాబు నాయుడు అన్నారు.

వైసీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులను కూడా వదలలేదని సీఎం చంద్రబాబు ఆరోపించారు. జగన్‌ హయాంలో కేసులకు గురైన వారిని ఎన్నికల్లో గెలిపించి.. అసెంబ్లీకి పెద్ద సంఖ్యలో పంపించారని అన్నారు. రఘురామకృష్ణంరాజు, పవన్‌ కళ్యాణ్, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు తదితరులపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం న్యాయవ్యవస్థను కూడా వదల్లేదని ఆరోపించారు. 2019-24 మధ్య కాలంలో ప్రభుత్వమే హింసను ప్రేరేపించిందని అన్నారు. శాంతి భద్రతలు విఫలమయ్యారని వైసీపీ నేతలు ఢిల్లీలో నిరసన తెలుపడం సిగ్గుచేటని చంద్రబాబు నాయుడు అన్నారు.


Next Story