నిరుద్యోగులకు శుభవార్త..విశాఖలో 7 ఐటీ సంస్థలకు నేడు శంకుస్థాపన

విశాఖపట్నంలో మరో 7 ఐటీ సంస్థల క్యాంపస్ ల నిర్మాణాలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు భూమిపూజతో పాటు భూమిపూజ శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు.

By -  Knakam Karthik
Published on : 12 Dec 2025 6:48 AM IST

Andrapradesh, Visakhapatnam, AP Government, Cm Chandrababu, Nara Lokesh, IT companies

నిరుద్యోగులకు శుభవార్త..విశాఖలో 7 ఐటీ సంస్థలకు నేడు శంకుస్థాపన

అమరావతి: ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సంస్థ కాగ్నిజెంట్, రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా గ్రూప్ తో పాటు విశాఖపట్నంలో మరో 7 ఐటీ సంస్థల క్యాంపస్ ల నిర్మాణాలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు భూమిపూజతో పాటు భూమిపూజ శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు. విశాఖ మధురవాడలో 1.టెక్ తమ్మిన (Tech Tammina (Sree Tammina Software Solutions Pvt. Ltd), 2.నాన్ రెల్ టెక్నాలజీస్(Nonrel Technologies Private Limited), 3.ఏసీఎన్ ఇన్ఫోటెక్ (ACN HealthCare RCM Services Pvt Ltd), కాపులుప్పాడలో 4.ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ (Imaginnovate Techsolutions (India) Pvt Ltd), 5.ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ (Fluentgrid Limited), 6.మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (Motherson Technology Services Limited), 7.క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (Quarks Technosoft Pvt Ltd) సంస్థలకు శంకుస్థాపనతో పాటు శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు.

1.టెక్ తమ్మిన (Tech Tammina (Sree Tammina Software Solutions Pvt. Ltd)

విశాఖ మధురవాడలోని ఎస్పీఎల్-4, హిల్ నెం-2లో ఏర్పాటుకానున్న టెక్ తమ్మిన సంస్థ రూ.62 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 500 మందిగి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది. నెదర్లాండ్స్, దుబాయ్, ఇండియాలో తన సేవలను అందిస్తోంది.

2.నాన్ రెల్ టెక్నాలజీస్(Nonrel Technologies Private Limited)

విశాఖ నాన్ ఐటీ సెజ్, హిల్ నెం-2లో ఏర్పాటుకానున్న నాన్ రెల్ టెక్నాలజీస్ సంస్థ రూ.50.60 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 567 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

3.ఏసీఎన్ ఇన్ఫోటెక్ (ACN HealthCare RCM Services Pvt Ltd)

విశాఖ ఐటీ సెజ్ హిల్ నెం-2లో ఏర్పాటుకానున్న ఏసీఎన్ హెల్త్ కేర్ ఆర్ సీఎం సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.30 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఏసీఎన్ ఇన్ఫోటెక్ సంస్థ 12 నెలల్లో తన వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనుంది.

4. ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ (Imaginnovate Techsolutions (India) Pvt Ltd)

విశాఖ భీమిలిలోని కాపులుప్పాడలో ఏర్పాటుకానున్న ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ రూ.140 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 2,600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

5.ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ (Fluentgrid Limited)

విశాఖ భీమిలి మండలం కాపులుప్పాడలో ఏర్పాటుకానున్న ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ సంస్థ రూ.150 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 2వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

6.మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (Motherson Technology Services Limited)

విశాఖపట్నం కాపులుప్పాడ ఫేజ్-1 ఐటీ పార్క్ లో ఏర్పాటుకానున్న మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ రూ.109.73 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 1,775 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

7.క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (Quarks Technosoft Pvt Ltd)

విశాఖ కాపులుప్పాడలో ఏర్పాటుకానున్న క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.115 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 2వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

Next Story