తిరుమలలో ఐదేళ్ల బాలుడు కిడ్నాప్

Five-year-old boy kidnapped at Tirumala. టీటీడీ గేటు ముందు ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన తిరుమలలో తీవ్ర కలకలం రేపింది.

By Medi Samrat  Published on  2 May 2022 3:01 PM IST
తిరుమలలో ఐదేళ్ల బాలుడు కిడ్నాప్

టీటీడీ గేటు ముందు ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన తిరుమలలో తీవ్ర కలకలం రేపింది. కిడ్నాప్‌కు గురైన బాలుడిని తిరుపతికి చెందిన గోవర్ధన్ రాయల్‌గా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. కడపకు చెందిన దంపతులు తిరుపతికి వచ్చి స్థిరపడ్డారు. వీరు తిరుమల కొండపై పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భర్త స్థానికంగా పనిచేస్తుండగా, భార్య గృహిణి, వీరు తిరుమల కొండపై నివాసం ఉంటున్నారు.

ఈ క్రమంలోనే ఆలయం ముందు కూర్చున్న బాలుడిని ఓ మహిళ కిడ్నాప్ చేసింది. ఆదివారం సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 6 గంటల వరకు కొడుకు కనిపించకపోవడాన్ని గమనించిన తల్లి ఆందోళనకు గురైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలుడిని అపహరించిన మహిళ తిరుపతికి వచ్చి ఏపీ03 జేడీ0300 నంబర్ గల ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మహిళను గుర్తించేందుకు పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.










Next Story