వైసీపీకి ఊహించని షాక్.. బీజేపీలో చేరిన కీలక నేత

Ex MLA Niraja Reddy Joined in BJP. అధికార వైసీపీకి షాకిచ్చారు క‌ర్నూలుకు చెందిన ఓ మాజీ ఎమ్మ‌ెల్యే. ప్ర‌తిప‌క్ష టీడీపీ

By Medi Samrat  Published on  12 Dec 2020 8:52 AM GMT
వైసీపీకి ఊహించని షాక్.. బీజేపీలో చేరిన కీలక నేత

అధికార వైసీపీకి షాకిచ్చారు క‌ర్నూలుకు చెందిన ఓ మాజీ ఎమ్మ‌ెల్యే. ప్ర‌తిప‌క్ష టీడీపీ నుంచి వైసీపీలోకి నేతలు ప‌రుగులు పెడుతుంటే క‌ర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే నీర‌జారెడ్డి వైసీపీని వీడి బీజేపీలో చేరడం చర్చనీయాంశమైంది. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు పార్టీ కండువా క‌ప్పి ఆమెను సాద‌రంగా పార్టీలోకి ఆహ్మానించారు. నీరజారెడ్డి చేరిక‌తో పశ్చిమ క‌ర్నూలులోని ఆలూరు, ప‌త్తికొండ‌, ఎమ్మిగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ బ‌లోపేత‌మ‌వుతుంద‌ని ఆ పార్టీ నాయ‌కులు విశ్వాసం వ్య‌క్తం చేస్తున్నారు. నీర‌జారెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో క‌ర్నూలు జిల్లాలో పార్టీని పూర్తి స్థాయిలో బ‌లోపేతం చేస్తామ‌న్నారు.

గెలిచిన రెండేళ్లకే రాజీనామా..

2009 ఎన్నికల్లో ఆలూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున నీర‌జారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే త‌న నియోజ‌క‌ర్గానికి స‌రిగ్గా ప‌నులు చేయ‌డం లేదంటూ ఆమె నిర‌స‌న తెలుపుతూ 2011లో ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడిన ఆమె కొన్నాళ్లు రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ 2019లో తిరిగి వైఎస్సార్ సీపీలో చేరారు. ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపు కోసం ఆమె ప‌నిచేశారు. అయితే ఇప్పుడు ఉన్న‌ట్టుండి అధికార వైఎస్సార్ సీపీని వీడి బీజేపీలో చేర‌డం ఒకింత ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.




Next Story