పవన్‌ కల్యాణ్‌ది వీకెండ్‌ ప్రజాసేవ

Ex Minister Perni Nani Criticises Pawankalyan. జనసేనాని పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని విరుచుకుపడ్డారు.

By Medi Samrat
Published on : 11 July 2022 3:45 PM IST

పవన్‌ కల్యాణ్‌ది వీకెండ్‌ ప్రజాసేవ

జనసేనాని పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని విరుచుకుపడ్డారు. పవన్‌ కల్యాణ్‌ది వీకెండ్‌ ప్రజాసేవ అంటూ పేర్ని నాని విమర్శించారు. పక్షానికోసారి సెలవు రోజున పవన్‌ కళ్యాణ్ ప్రజాసేవ చేయడానికి వస్తున్నారని అన్నారు. పవన్‌ కళ్యాణ్ షూటింగ్‌లకే కాదు, రాజకీయాల్లోనూ ఆలస్యమేనని విమర్శించారు. పవన్‌ అసెంబ్లీ గేటు ముట్టుకోవటమనేది ప్రజలు నిర్ణయిస్తారని చెప్పుకొచ్చారు.

వైసీపీ ప్లీనరీ అద్భుతంగా జరిగిందని చెప్పుకొచ్చారు పేర్ని నాని. ప్లీనరీలో కార్యకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారని.. జోరువానలో తడిసి ముద్దవుతున్నా కూడా కార్యకర్తలు ప్లీనరీలో పాల్గొన్నారన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో సోమవారం నాడు ఈ వ్యాఖ్యలు చేశారు. మేనిఫెస్టోలో 95 శాతం హామీలను అమలు చేసిన ప్రభుత్వం తమదేనని చెప్పుకొచ్చారు. చెప్పిన హామీలనే కాదు.. చెప్పనివి కూడా సీఎం జగన్‌ అమలు చేశారన్నారు.










Next Story