టీడీపీతోనే రాష్ట్ర భవిష్యత్తు : మాజీ మంత్రి దేవినేని ఉమా

టీడీపీ పాలనతోనే రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు స్పష్టం చేశారు

By Medi Samrat  Published on  3 Nov 2023 8:38 PM IST
టీడీపీతోనే రాష్ట్ర భవిష్యత్తు : మాజీ మంత్రి దేవినేని ఉమా

టీడీపీ పాలనతోనే రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు స్పష్టం చేశారు. శుక్రవారం నాడు పోలవరం నియోజకవర్గం పోలవరం మండలం పోలవరం గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని స్థానిక పార్టీ నేతలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి.. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే అమలుచేసే గ్యారెంటీ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అందులో మహిళలకు సంబంధించి మహాశక్తి, రైతులకు అన్నదాత, యువకులకు యువగళం, బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికి రక్షిత మంచి నీటి పథకంతో పాటు పూర్‌ టు రిచ కార్యక్రమాలు అమలుచేస్తామని తెలియజేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా ప్రజలు వివిధ సమస్యలతో బాధపడుతున్నారని.. వాటిని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. సంక్షేమం పేరుతో ఒక చేత్తో ఇస్తూ.. ప్రజల నడ్డి విరిచేలా పన్నుల భారం మోపుతోందన్నారు. ఒక పక్క బటన్‌ నొక్కుతూనే మరో పక్క పేద ప్రజల నుంచి గల్లాపట్టి పన్నులు వసూలు చేస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని కోరారు.

Next Story