చంద్రబాబు మోచేతి నీళ్లు ఎంత కాలం తాగుతారు.? : అంబటి

వైసీపీ సీనియ‌ర్ నేత అంబటి రాంబాబు జ‌న‌సేన నేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

By -  Medi Samrat
Published on : 20 Feb 2026 12:33 PM IST

చంద్రబాబు మోచేతి నీళ్లు ఎంత కాలం తాగుతారు.? : అంబటి

వైసీపీ సీనియ‌ర్ నేత అంబటి రాంబాబు జ‌న‌సేన నేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలను తిడుతూ, చెప్పు చూపిస్తూ కొడకల్లారా పవన్ కల్యాణ్ మాట్లాడారు.. అన్యాయాన్ని అన్యాయం అనలేని పవన్ కల్యాన్ ఉప ముఖ్యమంత్రా..? నేను కాపును కాదా..? పవన్ కల్యాణ్, నాగబాబు మాత్రమే కాపులా..? అంటూ ప్ర‌శ్న‌లు సంధించారు. కాపులు కష్టాల్లో ఉంటే గొంతెత్తింది అంబటి రాంబాబు మాత్రమేన‌న్నారు. ముద్రగడ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంటే గొంతెత్తింది అంబటి మాత్రమేన‌న్నారు. ముద్రగడ కుటుంబానికి అండగా దాసరి, చిరంజీవి వచ్చారన్నారు. వంగవీటి రంగాను కోల్పోయామన్నారు.

చంద్రబాబును తిడితే కమ్మవారిని తిట్టినట్లా..? అని ప్రశ్నించిన అయన.. కాపు కులానికి చెందిన అంబటి మీద దాడి చేస్తే ఎవరూ రియాక్ట్ కారా..? అని అడిగారు. చంద్రబాబు మోచేతి నీళ్లు నాగబాబు, పవన్ ఎంత కాలం తాగుతారు.? ప్రతీ కుక్కకు ఒక రోజు వస్తుందన్నారు. చంద్రబాబు 'కమ్మ'ని ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ 'కాపు' కాస్తున్నాడన్నారు. ఎన్ని ఏళ్ళు కాపు కాస్తవ్.. నీ బలం నీ కులం.. చంద్రబాబు బలం నువ్వు.. పిచ్చి రాజకీయాలు మానుకోవాల‌న్నారు.

పెమ్మసాని నాకు సినిమా చూపిస్తానని చెప్పారు.. అవును నాకు పెమ్మసాని సినిమా చూపించారు.. పెమ్మసాని సినిమాలో హీరో ఎవరు.? అని ప్ర‌శ్నించారు.

Next Story