నేడు టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక.. ఏం జరుగుతుందో అందరికీ తెలుసు..!

Election of TDP National President today. నేడు టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది

By Medi Samrat  Published on  27 May 2023 3:00 AM GMT
నేడు టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక.. ఏం జరుగుతుందో అందరికీ తెలుసు..!

నేడు టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఒంటి గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను పరిశీలిస్తారు. అనంతరం గంటపాటు అంటే సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది. అవసరమైతే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. రాత్రి ఏడు గంటలకు ఎన్నికైన జాతీయ అధ్యక్షుడి పేరును ఎన్నికల కమిటీ ప్రకటిస్తుంది. ఈ ఎన్నిక కోసం కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో ఎన్నికల కమిటీని పొలిట్ బ్యూరో నియమించింది. ఇందులో పార్టీ నాయకులు అశోక్ గజపతిరాజు, కాలువ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, గుమ్మడి సంధ్యారాణి, ఫరూక్ తదితరులు పర్యవేక్షకులుగా ఉంటారు. చంద్రబాబు నాయుడు ఎన్నిక లాంఛనమేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఆనవాయితీ కాగా, కరోనా కారణంగా ఈసారి జాప్యం జరిగింది. జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి చంద్రబాబు నాయుడును కాదని ఎవరూ పోటీలో నిలవరని తెలిసిందే..!


Next Story