మెతక ప్రభుత్వం కాదంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరికలు

ఏలూరు జిల్లా జగన్నాథపురం సభలో వైసీపీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు

By Medi Samrat  Published on  1 Nov 2024 6:33 PM IST
మెతక ప్రభుత్వం కాదంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరికలు

ఏలూరు జిల్లా జగన్నాథపురం సభలో వైసీపీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రభుత్వాన్ని మెతక ప్రభుత్వమని అనుకోకండి సూచించారు. సినిమాలు కాకుండా అందరూ భగవంతుని నామస్మరణ చేస్తే అద్భుతాలు జరుగుతాయని.. తనను చూసి OG ,OG అని అరిచే బదులు భగవంతుని నామస్మరణ చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. సరదా కోసం సినిమా ఉండాలని, ఆ సినిమా చూడాలంటే ముందు మన దగ్గర డబ్బు ఉండాలన్నారు పవన్ కళ్యాణ్.

నరసింహ వారాహి గణం పేరుతో జనసేనలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు. సనాతన ధర్మం పరిరక్షణ ఈ విభాగం ధ్యేయమన్నారు. అన్ని మతాలకు గౌరవం ఇవ్వాలని, మతాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు పవన్ కళ్యాణ్.

Next Story