వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు.
By Medi Samrat Published on 5 Feb 2025 6:48 PM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు. జ్వరంతోపాటు స్పాండిలైటిస్ బాధపెడుతోంది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకొంటున్నారు. వీటి మూలంగా గురువారం నాటి రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి పవన్ కల్యాణ్ గారు హాజరు కాలేకపోవచ్చని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన ద్వారా వెల్లడించింది.