అధికారాలు లేకుండా చేయడమే అధికార వికేంద్రీకరణా?

CPI Ramakrishna Letter To CM Jagan. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ

By Medi Samrat
Published on : 24 Nov 2021 10:08 AM IST

అధికారాలు లేకుండా చేయడమే అధికార వికేంద్రీకరణా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ రాశారు. సర్పంచులకు నిధులు, విధులు లేకుండా పంచాయతీల అభివృద్ధి ఎలా సాధ్యం? అని లేఖ‌లో ప్ర‌శ్నించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 14, 15 ఆర్థిక సంఘాల నిధులతో పాటు.. సాధారణ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం సరికాదని సూచించారు. సర్పంచులకు అధికారాలు లేకుండా చేయడమే మీరు చెబుతున్న అధికార వికేంద్రీకరణా? అని ప్ర‌శ్నించారు. పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని ఏపీ లోని సర్పంచులు ఆందోళనకు సిద్ధమవుతున్నారని.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పంచాయితీల నిధులు రూ.3,450 కోట్లను తిరిగి ఇవ్వాలని రామకృష్ణ లేఖ‌లో డిమాండ్ చేశారు.


Next Story