కొవిడ్ వ్యాక్సిన్ డైరన్(వ్యాక్సిన్ మాక్ డ్రిల్) దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైంది. కొవిన్ యాప్ పరిశీలన, వ్యాక్సిన్ పంపిణీలో తలెత్తే సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ఏపీలోని కృష్ణా జిల్లాలో ఉదయం ఈ డ్రై రన్ ప్రారంభమైంది. ప్రకాశ్‌నగర్ అర్భన్ హెల్త్ కేర్ సెంటర్‌లో డమ్మీ వ్యాక్సినేషన్ డ్రైరన్‌ను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఐదు సెంటర్లలో ఈ డ్రైరన్ కార్యక్రమం ప్రారంభమైందన్నారు. వెయింటింగ్ రూం, వ్యాక్సినేషన్ రూంతో పాటు వ్యాక్సిన్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశౄం. రేపు రియల్ టైంలో వ్యాక్సిన్‌ను అందించేందుకు ఈ ఏర్పాట్లు ఉపయోగపడుతాయన్నారు.
రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, కంకిపాడు మండలం ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సూర్యారావుపేటలోని పూర్ణా హార్ట్ ఇనిస్టిట్యూట్, కృష్ణవేణి డిగ్రీ కళాశాల, తాడిగడప సచివాలయం-4, ప్రకాష్ నగర్ పీహెచ్‌సీలలో డ్రై రన్ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి కేంద్రంలో ఐదుగురు సిబ్బంది, 3 గదులను ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరించి కార్యచరణ నివేదికను రాష్ట్ర , జిల్లా స్థాయి టాస్క్ పోర్స్‌లకు అందిస్తామని అధికారులు చెబుతున్నారు.