టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్‌

Corona positive for TDP chief Nara Chandrababu. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సామాన్యుడి నుండి సెలబ్రిటీలు,

By అంజి  Published on  18 Jan 2022 8:53 AM IST
టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సామాన్యుడి నుండి సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల వరకు ఎవ‌రిని కరోనా మహమ్మారి వ‌ద‌ల‌ట్లేదు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు కరోనా బారినపడ్డారు. కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నానని, స్వల్ప కొవిడ్‌ లక్షణాలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా చెప్పారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని అన్నారు. గత కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్‌ టెస్టులు చేయించుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం ఉండవల్లిలోని తన నివాసంలో హోంఐసోలేషన్‌లో చంద్రబాబు ఉన్నారు.

ఇదిలా ఉంటే సోమవారం చంద్రబాబు కుమారుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించారు. నారా లోకేష్ తన ట్విట్‌లో.. నాకు కొవిడ్‌ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. స్వ‌ల్ప‌ లక్షణాలు ఉన్న‌ప్ప‌టికీ నేను బాగానే ఉన్నాను. కోలుకునే వరకు ఐసోలేష‌న్‌లో ఉంటాను. ఈ మ‌ధ్య తనను క‌లిసిన వారు వీలైనంత త్వరగా పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ లోకేష్ తన ట్వీట్‌ను ముగించారు.

Next Story