కర్నూలులో ఘోర విషాదం.. ఆక్సిజన్ అందక అయిదుగురు మృతి

Corona Patients Lost Life. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్ అందక అయిదుగురి

By Medi Samrat  Published on  1 May 2021 10:59 AM GMT
కర్నూలులో ఘోర విషాదం.. ఆక్సిజన్ అందక అయిదుగురు మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్ అందక అయిదుగురి ప్రాణాలు పోయాయి. కర్నూలు కేఎస్‌ కే‌ర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఐదుగురు కరోనా రోగులు మృతి చెందారు. తమకు ఆక్సిజన్ అందడం లేదని రోగులు చెబుతున్నా కూడా ఆస్పత్రి సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదని బంధువులు ఆరోపించారు. కరోనా చికిత్సకు ఈ ఆస్పత్రి వైద్యులకు ఎలాంటి అనుమతులు లభించలేదు. అయినా సరే కరోనా చికిత్స చేస్తున్నారు. అయితే ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో వారు ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసులను చూడగానే ఆస్పత్రి సిబ్బంది పరారయ్యారు. ఆస్పత్రి ఎండీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మొదట్లో కేవలం ఐసోలేషన్‌లో ఉన్న వారికి మాత్రమే చికిత్స అందిస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

ఈ సంఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే స్పందించిన కలెక్టర్‌ ఆస్పత్రిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై విచారణ చేపడుతున్నట్లు కర్నూలు కలెక్టర్‌ తెలిపారు. కర్నూలులోని కేఎస్‌ కేర్‌ ఆస్పత్రిలో కరోనా చికిత్సకు అనుమతి లేదు. అయినా కూడా నిబంధనలకు విరుద్ధంగా కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అనుమతి లేకుండానే కోవిడ్ చికిత్స చేస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. కోవిడ్ ఆస్పత్రిగా నోటిఫైడ్ చేయని కేఎస్కేర్ ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా బాధితులు ఆక్సిజన్ అందక చనిపోయారనితెలుసుకుని డీఎంహెచ్ఓ డాక్టర్‌ రామగిడ్డయ్య విచారణ మొదలు పెట్టారు. కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాల మేరకు అధికారులు ఆస్పత్రికి వెళ్లారు. కేఎస్‌కేర్ ఆస్పత్రిలో ఉన్న బాధితులందరినీ అంబులెన్స్‌లో కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు. అనుమతి లేకుండా కోవిడ్ పేషేంట్స్‌ను అడ్మిట్ చేసుకుని అనధికారికంగా ట్రీట్మెంట్ ఇచ్చిన ఆస్పత్రి యజమాన్యంపై క్రిమినల్ కేసు బుక్ చేశారు.


Next Story
Share it