రేపు జగనన్న వసతి దీవెన

CM YS Jagan will release Jagananna Vasathi Deevena Installment on tomorrow. సీఎం జ‌గ‌న్ బుధ‌వారం అనంతపురం జిల్లా నార్పలలో ప‌ర్య‌టించ‌నున్నారు.

By Medi Samrat
Published on : 25 April 2023 9:30 PM IST

రేపు జగనన్న వసతి దీవెన

CM YS Jagan

సీఎం జ‌గ‌న్ బుధ‌వారం అనంతపురం జిల్లా నార్పలలో ప‌ర్య‌టించ‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జగనన్న వసతి దీవెన ఆర్ధిక సాయాన్ని సీఎం జగన్‌ విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జ‌మ‌చేయ‌నున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 912.71 కోట్లు బటన్‌ నొక్కి జమ చేయనున్నారు. రేపు జమ చేయ‌నున్న‌ రూ. 912.71 కోట్లతో కలిపి జగనన్న వసతి దీవెన ద్వారా ఇప్పటివరకు 25,17,245 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ప్ర‌భుత్వం రూ. 4,275.76 కోట్లు జమ చేసిన‌ట్లుగా పేర్కొంది. 2017 సంవత్సరం బకాయిలు రూ. 1,778 కోట్లతో కలిపి.. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద ఇప్పటివరకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 14,223.60 కోట్లకు చేరింది.


Next Story