రేపు తణుకులో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన.. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి శ్రీకారం

CM YS Jagan to visit West Godavari district tomorrow. సీఎం వైఎస్‌ జగన్‌.. రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. తణుకులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని సీఎం జగన్‌

By అంజి  Published on  20 Dec 2021 2:53 PM IST
రేపు తణుకులో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన.. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి శ్రీకారం

సీఎం వైఎస్‌ జగన్‌.. రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. తణుకులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు సీఎం జగన్‌.. తాడేపల్లిలో తన నివాసం నుండి బయల్దేరనున్నారు. ఉదయం 11 గంటలకు తణుకు చేరుకుంటారు. అక్కడి నుండి నేరుగా తణుకు జెడ్పీ బాలుర హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన సభకు హాజరు అవుతారు. ఆ తర్వాత సీఎం జగన్‌.. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రజలను సీఎం జగన్‌ మాట్లాడుతారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన గృహనిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటారు.

అక్కడి నుండి మధ్యాహ్నం 1 గంటలకు తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. ఒక రోజు విరామం తర్వాత 23, 24, 25 తేదీల్లో కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటిస్తారు. తన నియోజకవర్గం పులివెందుల క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం జగన్‌ పాల్గొననున్నారు. 23వ తేదీన కడప జిల్లా పర్యటన సందర్భంగా కొప్పర్తి వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత స్వస్థలం ఇడుపులపాయకు చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్‌ క్రిస్మస్‌ వేడుకలను జరుపుకోనున్నారు. పులివెందుల చర్చిలో సీఎం జగన్‌ ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.

Next Story