జగన్ మీ బిడ్డ...ఎప్పుడూ ఒకేలా ఉంటాడు
CM YS Jagan Fire On Chandrababu. మూడేళ్లలో రాష్ట్రంలో కరువు లేదని.. ఒక్క కరువు మండలం కూడా లేదని సీఎం జగన్ అన్నారు.
By Medi Samrat Published on 16 May 2022 8:10 AM GMTమూడేళ్లలో రాష్ట్రంలో కరువు లేదని.. ఒక్క కరువు మండలం కూడా లేదని సీఎం జగన్ అన్నారు. ఏలూరు జిల్లా గణపవరంలో జరిగిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆహారధాన్యాల ఉత్పత్తి సగటున 16 లక్షల టన్నులు పెరిగిందని తెలిపారు. చంద్రబాబు దత్తపుత్రుడు పరామర్శకు బయల్దేరాడు. పరిహారం అందకుండా ఉన్న ఒక్క రైతును చూపించలేకపోయాడని విమర్శించాడు. గత ప్రభుత్వంలో వడ్డీలేని రుణాలుకు ఐదేళ్లలో చెల్లించింది రూ.782 కోట్లు అయితే.. మన ప్రభుత్వంలో మూడేళ్లలో వడ్డీలేని రుణాలకు ఇచ్చింది రూ.1282 కోట్లు అని తెలిపారు.
వ్యవసాయం, ఉచిత విద్యుత్ దండగన్న నాయకుడు.. కాల్పులు జరిపి రైతులను చంపిన నాయకుడు.. రుణాలు మాఫీ చేస్తానని చేయని నాయకుడిని ఓ సారి గుర్తుకు తెచ్చుకోండని చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు రైతులను మోసం చేస్తే.. దుష్టచతుష్టయం,. దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించలేదని దుయ్యబట్టారు.
ఉచిత పంటల బీమా ద్వారా 31 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని జగన్ తెలిపారు. గత ప్రభుత్వం, మన ప్రభుత్వం మధ్య తేడాను ప్రజలు గమనించాలని చెప్పారు. ఆక్వా జోన్‌లో ఉన్న పదెకరాల వరకు రూపాయిన్నర విద్యుత్ సబ్సిడీ వర్తింపు ఉంటుందని తెలిపారు. రాజకీయాల గురించి ఆలోచించను.. ప్రజలకు మంచి చేయాలనేదే నా తపన అని తెలిపారు. కొల్లేరులో రీ సర్వేకే ఆదేశాలు ఇచ్చాం.. రాబోయే రోజుల్లో అమలు జరుగుతుందని.. జగన్ మీ బిడ్డ.. ఎప్పుడూ ఒకేలా ఉంటాడని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.