విశాఖ పర్యటనను వాయిదా వేసుకున్న ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్

CM Jagan's visit to Visakha postponed. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విశాఖపట్నం పర్య‌ట‌న వాయిదా ప‌డింది.

By Medi Samrat  Published on  11 July 2022 8:45 PM IST
విశాఖ పర్యటనను వాయిదా వేసుకున్న ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విశాఖపట్నం పర్య‌ట‌న వాయిదా ప‌డింది. ఆటో డ్రైవ‌ర్ల‌కు ప్ర‌భుత్వం అందిస్తున్న వాహ‌న మిత్ర నిధుల‌ను విడుద‌ల చేసే నిమిత్తం ఈ నెల 13న విశాఖ ప‌ర్య‌ట‌న‌ను జ‌గ‌న్ ఖ‌రారు చేసుకున్నారు. విశాఖ‌లోని ఆంధ్రా యూనివ‌ర్సిటీలో ఏర్పాటు చేయ‌నున్న కార్య‌క్ర‌మంలో వాహ‌న మిత్ర నిధుల‌ను జ‌గ‌న్ ల‌బ్ధిదారుల ఖాతాల్లో జ‌మ చేయ‌నున్నారు. అయితే గ‌డ‌చిన రెండు రోజులుగా దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రో మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురుస్తాయంటూ వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరిక‌లు జారీ చేయడంతో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ను ఈ నెల 15కు వాయిదా వేస్తున్న‌ట్లు ఏపీ ప్ర‌భుత్వం సోమ‌వారం సాయంత్రం ప్ర‌కటించింది.


Next Story