రేపు, ఎల్లుండి సీఎం జగన్ తిరుమల పర్యటన
CM Jagan's visit to Tirumala. మంగళవారం బ్రహ్మొత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు ఏపీ సీఎం జగన్.
By Medi Samrat Published on 26 Sept 2022 4:34 PM IST
మంగళవారం బ్రహ్మొత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు ఏపీ సీఎం జగన్. అనంతరం బుధవారం నంద్యాల జిల్లాలో రామ్‌కో సిమెంట్స్ ఫ్యాక్టరీలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు రెండు రోజుల పర్యటన షెడ్యూల్ విడుదలైంది.
27.09.2022 షెడ్యూల్
సాయంత్రం 3.45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి 5.20 గంటలకు తిరుపతి గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఆ తర్వాత అలిపిరి చేరుకుని తిరుమలకు విద్యుత్ బస్సులను ప్రారంభిస్తారు. రాత్రి 7.45 గంటలకు తిరుమలలో బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి బయలుదేరి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి, స్వామిని దర్శించుకుంటారు. రాత్రికి తిరుమలలోనే బసచేస్తారు.
28.09.2022 షెడ్యూల్
ఉదయం 6.05 గంటలకు స్వామివారిని దర్శించుకున్న అనంతరం నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని ప్రారంభిస్తారు. 7.10 గంటలకు టీటీడీ కోసం వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్మించిన లక్ష్మి వీపీఆర్ రెస్ట్ హౌస్‌ను ప్రారంభిస్తారు. 9.55 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్ నుంచి ఓర్వకల్ బయలుదేరుతారు. 10.55 గంటలకు నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల చేరుకుని రామ్‌కో సిమెంట్స్ ఫ్యాక్టరీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.05 గంటలకు ఓర్వకల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి 2.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.