సీఎం వైఎస్ జగన్ రెండో రోజు గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి ఏఎస్‌ఆర్ జిల్లా చింతూరు చేరుకుంటారు. ఉదయం 9.30 గంటలకు చింతూరు మండలం కుయుగూరు, చట్టి గ్రామాల్లో వరద బాధితులతో సమావేశమవుతారు. ఆక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నయగుట్ట గ్రామం చేరుకుని అక్కడ ఏర్పాటుచేసిన వరద బాధిత గ్రామాలకు సంబంధించిన ఫోటో గ్యాలరీని పరిశీలిస్తారు. అనంతరం తిరుమలాపురం, నార్లవరం గ్రామాలకు చెందిన వరద బాధితులతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.