రేపు చిలకలూరిపేటకు సీఎం జ‌గ‌న్

CM Jagan Will Visit Chilakaluripet Tomorrow. రేపు సీఎం వైఎస్‌ జగన్‌ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల

By Medi Samrat  Published on  5 April 2023 7:34 AM GMT
రేపు చిలకలూరిపేటకు సీఎం జ‌గ‌న్

CM Jagan


రేపు సీఎం వైఎస్‌ జగన్‌ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం జగన్ ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు లింగంగుంట్ల చేరుకుంటారు. అక్కడ డాక్టర్‌ వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ సెంటర్‌ని పరిశీలించిన అనంతరం సమీపంలోని ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్ట్‌ స్టాళ్ళను పరిశీలించనున్నారు. ఆ తర్వాత కావూరు గ్రామంలో సభా ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 12.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


Next Story