సీఎం జగన్ తిరుమల పర్యటన షెడ్యూల్ ఖరారు

CM Jagan Tirumala Visit Schedule. సీఎం జగన్ తిరుమల పర్యటన షెడ్యూల్ ఖరారయ్యింది. ఈనెల 11వ తేదీన విజయవాడ

By Medi Samrat  Published on  8 Oct 2021 3:18 PM IST
సీఎం జగన్ తిరుమల పర్యటన షెడ్యూల్ ఖరారు

సీఎం జగన్ తిరుమల పర్యటన షెడ్యూల్ ఖరారయ్యింది. ఈనెల 11వ తేదీన విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు సీఎం జగన్. అదేరోజు సాయంత్రం తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరఫున సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. తిరుమలలో 7వ తేది నుంచి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏటా బ్రహ్మోత్సవాల మొదటిరోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం పట్టువస్ర్తాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ ఏడాది కొవిడ్‌-19 నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ లేని కారణంగా పూర్వసంప్రదాయాన్ని పాటిస్తూ గరుడవాహనం జరిగే 11వ తేదీనే సీఎం జగన్‌ పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు.


Next Story