సీజేఐ ఎన్వీ రమణను కలిసిన సీఎం జగన్‌

CM Jagan meets Supreme Court Chief Justice NV Ramana. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు.

By అంజి  Published on  25 Dec 2021 11:44 AM GMT
సీజేఐ ఎన్వీ రమణను కలిసిన సీఎం జగన్‌

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ నగరంలోని నోవాటెల్‌ హెటల్‌లో జస్టిస్‌ ఎన్వీ రమణను సీఎం వైఎస్‌ జగన్‌, భారతిలు కలిసి మాట్లాడారు. గత 3 రోజులుగా సీఎం జగన్‌ కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు, శంకుస్థాపనలు, పథకాల అమలు కార్యక్రమాలను చేపట్టారు. ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్‌ పర్యటన ముగియడంతో.. ఆయన నేరుగా విజయవాడకు వచ్చారు. అనంతరం జస్టిస్‌ ఎన్వీ రమణను కలిశారు. వీరి భేటీలో ప్రధానంగా ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిణామాల గురించి చేర్చించినట్లు తెలుస్తోంది.

సీజేఐ ఎన్వీ రమణ పర్యటన నేపథ్యంలో ఆయన గౌరవార్థం ఏపీ ప్రభుత్వం తేనీటి విందును ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే డిసెంబర్ 24వ తేదీన కృష్ణా జిల్లాలోని స్వగ్రామం పొన్నవరం జస్టిస్‌ ఎన్వీ రమణ వెళ్లారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఆయన సొంతూరు జస్టిస్‌ రమణ వచ్చారు. ఈ సందర్భంగా..ఆయనకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అంతకుముందు జస్టిస్‌ ఎన్వీ రమణ తెలంగాణలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. గతంలో జస్టిస్‌ ఎన్వీ రమణకు, సీఎం జగన్‌కు మధ్య విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. సీఎం అప్పటి సీజేఐ జస్టిస్‌ బాబ్డేకు.. జస్టిస్‌ రమణకు వ్యతిరేకంగా లెటర్‌ రాశారు.

Next Story