ప్ర‌ధాని మోదీకి సీఎం జ‌గ‌న్ లేఖ‌..

CM Jagan Letter To PM Modi. ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని

By Medi Samrat  Published on  22 May 2021 12:24 PM GMT
ప్ర‌ధాని మోదీకి సీఎం జ‌గ‌న్ లేఖ‌..

ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని మా నిర్ణయమ‌ని తెలిపారు. టీకా కొరతతో ప్రస్తుతం 45 ఏళ్ల వారికే ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని.. 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్‌ ప్రక్రియ ప్రారంభించలేకపోయామ‌ని.. ఇలాంటి స్థితిలో ప్రైవేట్‌ ఆస్పత్రులకు వ్యాక్సిన్‌ ఇవ్వడం సరికాదని లేఖ‌లో పేర్కొన్నారు.


ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో టీకా ధరలు వేర్వేరుగా ఉన్నాయని.. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో డోసుకు రూ.2 వేల నుంచి రూ.25 వేలు వసూలు చేస్తున్నారని.. ప్రస్తుత పరిస్థితిలో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో టీకాల వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని.. ప్రభుత్వ నియంత్రణ లేకుంటే టీకాలను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తారని పేర్కొన్నారు. టీకాల కొరత అంటూనే ప్రైవేటుకు ఎలా ఇస్తారని.. ఇటువంటి ప‌రిస్థితుల్లో సామాన్య ప్రజల నుంచి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్రాల మార్గదర్శకాల మేరకే టీకా కార్యక్రమం జరగాలని లేఖ‌లో పేర్కొన్నారు.


Next Story
Share it