ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు విజయవాడలోని మురళీ ఫార్చ్యూనర్ హోటల్‌లో జరిగే జీఎఫ్ఎస్‌టీ టూరిజం కాంక్లేవ్‌లో పాల్గొంటారు. ఈ కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం 2.45 గంటలకు గుంటూరు బయలుదేరుతారు. 03.00 గంటలకు గుంటూరులోని ఆర్‌వీఆర్ & జేసీ కాలేజీలో నిర్వహించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఏపీ పోలీస్ - హ్యాకథాన్ 2025 కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామానికి వెళ్తారు. అక్కడ జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను పరిశీలిస్తారు. సాయంత్రం 05.45 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.