ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ వెళ్లారు. రేపు ఢిల్లీలో ఉప రాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఎ భాగస్వామ్య పక్షంగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు.