మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌కు సీఎం చంద్రబాబు పరామర్శ

ఆంధ్రప్రదేశ్ న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు.

By Medi Samrat
Published on : 22 March 2025 8:58 PM IST

మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌కు సీఎం చంద్రబాబు పరామర్శ

ఆంధ్రప్రదేశ్ న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో ఫరూక్ నివాసానికి చంద్రబాబు వెళ్లారు. మంత్రి ఫరూక్ సతీమణి షెహనాజ్ మృతి పట్ల సంతాపం తెలుపారు. మనో ధైర్యంతో ఉండాలని కుటుంబ సభ్యులతో చంద్రబాబు పేర్కొన్నారు. దాదాపు గంట సమయం పాటు మంత్రి కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు.మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, సీపీఐ నేత రామకృష్ణ, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, భూమా అఖిలప్రియ, కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, గిత్త జయసూర్య, పరిటాల సునీత, టిడిపి నాయకులు భార్గవ్ రామ్, తుగ్గలి నాగేంద్ర, తిక్కారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మాండ్ర శివానందరెడ్డి,పరిటాల శ్రీరామ్, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, మార్కుఫెడ్ మాజీ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టిడి జనార్ధన్,వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నాయకులు మంత్రి ఫరూక్ ను పరామర్శించారు.

Next Story