స్త్రీ శక్తి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్ర‌బాబు.. మ‌ధ్య‌లో ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌లు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో స్త్రీ శక్తి బస్సులో ప్రయాణించారు.

By Medi Samrat
Published on : 30 Aug 2025 2:31 PM IST

స్త్రీ శక్తి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్ర‌బాబు.. మ‌ధ్య‌లో ఆస‌క్తిక‌ర సంభాష‌ణ‌లు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో స్త్రీ శక్తి బస్సులో ప్రయాణించారు. మహిళలు, రైతులతో కలిసి సీఎం బస్సులో ప్రయాణించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు మహిళలు, రైతులతో సంభాషిస్తూ బస్సులో సీఎం ప్రయాణం చేశారు. స్త్రీ శక్తి పేరుతో అందిస్తున్న ఉచిత బస్సు సదుపాయం ఎలా ఉందని చంద్రబాబు మహిళలను అడిగి తెలుసుకున్నారు. తాము ఎక్కడికి వెళ్లినా ఇబ్బంది లేకుండా.. ఫ్రీ బస్సులో వెళ్తున్నామని మహిళలు చంద్ర‌బాబుకు చెప్పారు. చక్కటి సదుపాయాన్ని కల్పించారని.. తమకు డబ్బులు ఆదా అవుతున్నాయని మహిళలు సీఎంతో చెప్పారు. హంద్రీ-నీవా ద్వారా కృష్ణా నీళ్లు తొలిసారి కుప్పానికి వచ్చాయి.. కాల్వల్లో నీళ్లు చూశారా..? చెరువులు నిండాయా అంటూ చంద్రబాబు ఆరా తీశారు. తొలిసారి కుప్పానికి కృష్ణమ్మ వచ్చిందని.. చాలా సంతోషంగా ఉందని రైతులు, మహిళలు చంద్ర‌బాబుతో చెప్పారు.

Next Story