సీఎం చంద్రబాబు లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటీవలే దుబాయ్‌లో పర్యటించిన ఆయన ఇప్పుడు లండన్ టూర్‌కు సిద్ధమయ్యారు. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన లండన్ టూర్ ఖరారు అయింది. సీఎం చంద్రబాబు నవంబర్ 6న అమరావతి నుంచి లండన్ బయల్దేరి వెళ్తారు. లండన్ లోని పారిశ్రామిక వేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని సైతం వివరించనున్నారు. పలు రంగాల్లో పెట్టుబడులు ఆహ్వానించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.