రాజధాని రైతు దొండపాటి రామారావు కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. దొండపాటి రామారావు కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎన్-8 రహదారి విషయమై నిన్న తుళ్లూరు మండలం, మందడంలో రైతులతో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సమావేశం అయ్యారు. సమావేశంలో పాల్గొన్న సమయంలోనే రైతు రామారావు గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. ఆలోపే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి ఈ రోజు రామారావు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని రామారావు కుటుంబ సభ్యులకు సీఎం భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే రామారావు కుటుంబానికి అండగా ఉండాలని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌కు సీఎం చంద్రబాబు సూచించారు.