లండన్‌కు సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు.

By -  Medi Samrat
Published on : 16 Oct 2025 4:48 PM IST

లండన్‌కు సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. లండన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు అధికారికంగా ధృవీకరించారు. నవంబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్‌కు బయల్దేరుతారు. ఈ పర్యటన మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఈ పర్యటన లో ఆయన పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు. నవంబర్ నెలలో విశాఖపట్నంలో జరగబోయే సీఐఐ పారిశ్రామిక సదస్సు ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో, సదస్సుకు ముందే కీలకమైన పారిశ్రామికవేత్తలను కలిసి ఏపీకి ఆహ్వానించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. తన లండన్ పర్యటనలో భాగంగా అక్కడి పారిశ్రామిక దిగ్గజాలను విశాఖ సదస్సుకు ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు.

Next Story