ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్నం 3.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకోనున్నారు. సాయంత్రం 4.45 గంటలకు ఆర్కేబీచ్‌కు చేరుకుని తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 6.30 గంటలకు గవర్నర్ బంగ్లా సమీప తూర్పు నౌకాదళాధిపతి నివాసంలో జరిగే తేనేటి విందుకు హాజరవుతారు. రాత్రి 7.15 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.
శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహసభల్లో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వరల్డ్ తెలుగు ఫెడరేషన్ సావనీర్ , తెలుగు ఏంజిల్స్ పేరుతో స్టార్టప్ లోగోను ఆయన ఆవిష్కరించారు. పలువురికి బిజినెస్ అవార్డులను అందించారు.