అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు అనూహ్య స్పందన..సీఎం హర్షం

అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు అనూహ్య స్పందన వస్తుండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

By -  Knakam Karthik
Published on : 19 Jan 2026 2:50 PM IST

Andrapradesh, Amaravati, Cm Chandrababu, Ap Government, Advanced Quantum Skilling Course

అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు అనూహ్య స్పందన..సీఎం హర్షం

అమరావతి: అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు అనూహ్య స్పందన వస్తుండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ ఈ కోర్సు నేర్చుకునేందుకు గానూ 50 వేల మంది నమోదు చేసుకోవటంపై సీఎం ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీలో లక్ష మంది క్వాంటం నిపుణుల్ని తయారు చేసేలా సంకల్పం చేశామని పేర్కోన్నారు. ఐఐటీ మద్రాస్, ఐబీఎం రీసెర్చ్ కేంద్రం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎన్ పీటీఈఎల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న అడ్వాన్స్ డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సు నేర్చుకునేందుకు ఇంత పెద్ద సంఖ్యలో నమోదు కావటం ఆనందాన్ని ఇస్తోందని సీఎం స్పష్టం చేశారు.

అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన లక్ష మంది అత్యుత్తమ క్వాంటం కంప్యూటింగ్ నిపుణుల్ని తయారు చేయాలన్న లక్ష్యాన్ని ఇది సాకారం చేస్తోందని సీఎం స్పష్టం చేశారు. క్వాంటం రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులు, ఆవిష్కరణలు, పరిశోధనలకు ఏపీని గమ్య స్థానంగా ఇది మారుస్తుందని ఆయన ఆకాంక్షించారు. క్వాంటం కంప్యూటింగ్ స్కిల్లింగ్ కోర్సులో బంగారు, వెండి పతకాలు సాధించే నిపుణులను స్వయంగా సత్కరించేందుకు ఎదురు చూస్తుంటానని స్పష్టం చేశారు. భవిష్యత్తులో క్వాంటం రంగంలో వారే గ్లోబల్ లీడర్లుగా ఎదిగేందుకు ఆస్కారముందని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

Next Story