ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీయాలనేది ఫ్యాక్షనిస్టులకు అలవాటు : సీఎం చంద్రబాబు

శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామ‌ని సీఎం చంద్రబాబు హెచ్చ‌రించారు.

By -  Medi Samrat
Published on : 13 Feb 2026 2:48 PM IST

ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీయాలనేది ఫ్యాక్షనిస్టులకు అలవాటు : సీఎం చంద్రబాబు

శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామ‌ని సీఎం చంద్రబాబు హెచ్చ‌రించారు. రాజకీయ ముసుగులో కొందరు నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. తిరుపతి లడ్డూ వ్యవహారం చాలా సున్నితమైన అంశమ‌ని.. కొందరు కావాలని దేవుడి పవిత్రతను, భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని ప్రయత్నించారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఒక్కసారైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం ఆనవాయితీ.. జరిగిన తప్పులను చెప్పకుండా ఉంటే.. ఆ అపవిత్రతను కొనసాగించేందుకు వాళ్లు ఏమాత్రం వెనుకాడరు.. టీటీడీ సహా అన్ని దేవాలయాల్లో పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిందే కాక.. ఆ వివాదంలోకి హెరిటేజ్ సంస్థను తీసుకు వచ్చారన్నారు. వివేకా హత్య కేసు ఘటనలో ఎన్ని నాటకాలు ఆడారు.. సాక్షిపత్రికలో నారాసుర రక్త చరిత్ర అని రాశారు.. వాళ్లు చేసిన నేరాన్ని తప్పించుకోవడానికి ఇతరులపై నెట్టేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని హెరిటేజ్ సంస్థకు ముడిపెట్టి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. హెరిటేజ్ అనేది ఫ్యామిలీ బిజినెస్ లైవ్ లీ హుడ్ కింద వ్యాపారం చేస్తున్నారు.. బ్రాండ్ దెబ్బతీసేలా ఆ పత్రికలో అవాస్తవ కథనాలు ప్రచురిస్తున్నారన్నారు.

గతంలో రాయలసీమ ఫ్యాక్షన్లో భాగంగా కక్ష తీర్చుకునేందుకు చీనీ చెట్లను నరికి వేసేవారు.. ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీయాలనేది ఫ్యాక్షనిస్టులకు అలవాటు.. దాంతో ప్రత్యర్థులు తీవ్రంగా నష్ట పోయే పరిస్థితి.. ఇప్పుడు ఇలాంటి వ్యవహారాన్నే వారు నడిపిస్తున్నారని అన్నారు.

Next Story