ఆస్తిలో వాటా ఇవ్వకుండా తల్లీ, చెల్లిని రోడ్డుకు లాగి మమ్మల్ని నిందిస్తున్నాడు : సీఎం చంద్రబాబు

ప్రస్తుతం ఏపీ అభివృద్ధి గురించి ప్రజలంతా మంచిగా మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో గతంలో జరిగిన విధ్వంసం గురించి మాట్లాడుకున్నారని సీఎం చంద్రబాబు అన్నారు

By Medi Samrat  Published on  24 Oct 2024 7:26 PM IST
ఆస్తిలో వాటా ఇవ్వకుండా తల్లీ, చెల్లిని రోడ్డుకు లాగి మమ్మల్ని నిందిస్తున్నాడు : సీఎం చంద్రబాబు

‘ప్రస్తుతం ఏపీ అభివృద్ధి గురించి ప్రజలంతా మంచిగా మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో గతంలో జరిగిన విధ్వంసం గురించి మాట్లాడుకున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. చీకటి జీవోలతో పాలన సాగించారని గ‌త వైసీపీ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ప్రభుత్వం పాలన అందించేటప్పుడు పారదర్శకత ఉండాలి. ఐదేళ్ల చీకటి జీవోలపై విచారణ చేయిస్తున్నామ‌ని తెలిపారు. గత పాలకుల అరాచకాలన్నీ బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు.

తల్లి, చెల్లితో గొడవలు పెట్టుకుని వాటిలోకి మమ్మల్ని లాగుతున్నారని జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌రిచ్చారు. తండ్రి సంపాదించిన ఆస్తి తల్లికి రానివ్వకుండా చేస్తున్నాడు. తల్లి, చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తిపై కండీషన్ పెడతారా ఎవరైనా.? 2004లో జగన్ ఆదాయం ఎంత? ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అని ప్ర‌శ్నించారు.

దీపావళి నుండి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించబోతున్నాం. కేంద్రం అమరావతికి డబ్బులిస్తామంటే వద్దన్నారు. ప్రజావేదిక కూల్చారు.. నేను తలచుకుంటే ఇప్పుడు కూల్చడాలు చేయలేనా.? అమరావతిని ఎడారిగా చేశారు. భూములిచ్చిన రైతుల ఇళ్లపై డ్రోన్లు ఎగరేశారు. తప్పుడు పనులు చేసి పరదాలు కట్టుకు తిరిగారు. ఇటువంటి వ్యక్తితో రాజకీయ చేస్తానని అనుకోలేదు. ఎంతోమందితో సిద్ధాంత పరంగా, అభివృద్ది పరంగా పోరాటం చేశాను. చిల్లరకంటే హీనమైన రాజకీయాలు జగన్ చేశారని వ్యాఖ్యానించారు. రోడ్లు మొత్తం గుంతలు పెట్టారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను పేరబెట్టారు. చెత్త పన్ను కట్టలేదని ఇంటిముందు చెత్తవేశారు. ఆ పార్టీలో ఉండేవారు కూడా పార్టీ పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గు పడాలి. విలువల్లేని మనుషులతో సమాజానికి చేటు. చెత్తటీవీ, చెత్త పేపరులో నోటికొచ్చింది రాసుకున్నారు. గత ఐదేళ్లు నన్ను బయటకు రానివ్వలేదు. కానీ మేం జగన్ ను తిరగనిస్తున్నాం. అమరావతిలో పర్యటించిన సమయంలో నాపై రాళ్లు వేయించారు.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కుందని నాటి డీజీపీ అన్నారు. ఇప్పటి అధికారులకు నేను అలా చెప్పడం లేదు. తెనాలి అత్యాచారం కేసులో నిందితుడి తల్లే చెప్తోంది.. వైసీపీలో చేరి తన కొడుకు చెడిపోయాడని.. బంధువుల మధ్యే నేరం జరిగిందని చెప్తుంటే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు’’ అని సీఎం అన్నారు.

Next Story