మహిళల ఆశీస్సులు ఉన్నంత వరకు కొండలనైనా పిండి చేస్తాం: సీఎం చంద్రబాబు
మీ ఆనందం కోసమే మేం అహర్నిశల పని చేస్తున్నాం..అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు
By Knakam Karthik
మహిళల ఆశీస్సులు ఉన్నంత వరకు కొండలనైనా పిండి చేస్తాం: సీఎం చంద్రబాబు
మీ ఆనందం కోసమే మేం అహర్నిశల పని చేస్తున్నాం..అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో మహిళలకు ఉచిత బస్సు పథకం ఆయన ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. 2 కోట్ల 65 లక్షల మంది మహిళలకు విన్నపం. మీ ఆనందం కోసమే మేము అహర్నిశలు పనిచేస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ వికసిత భరత్ 2047 తెస్తే మనం స్వర్ణాంధ్ర 2047 తీసుకువచ్చాం. మహిళల ముఖాల్లో ఆనందం చూస్తే నా పూర్వ జన్మ సుకృతం. మహిళలకు ఆర్థిక స్వతంత్రం తేవటం మీ గౌరవం మరింత పెంచటానికి NDA ప్రభుత్వం పనిచేస్తుంది. రాష్ట్రం లో ఏ ప్రాంతానికి వెళ్లాలన్న స్వేచ్చ మహిళలకు కూటమి ప్రభుత్వం కల్పించింది. ఇపుడు సగర్వంగా చెబుతున్నాం సూపర్ సిక్స్ సూపర్ హిట్. కూటమి పొత్తు గురించి భేషరతుగా చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. గత 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. మహిళలు అసలు నవ్వార, ఇంట్లో అయినా ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా ను. రోడ్డు పైకి వస్తే జాగ్రత్తగా ఇంటికి వెళ్లలేని పరిస్థితి. కానీ మన ప్రభుత్వంలో మాత్రం మహిళల జోలికి వచ్చే సాహసం ఎవరు చేయరు. మహిళలను ఆర్థికంగా ఎదిగేందుకు డ్వాక్రా, మెప్మా సంఘాలను ఏర్పాటు చేశాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు అవకాశం ఇచ్చాం...తొందర్లో డ్రైవర్లుగా మహిళలను చూడబోతున్నారు. ఎలక్ట్రికల్ బస్సులకు మహిళా డ్రైవర్లను నియమిస్తాం..అని సీఎం చంద్రబాబు తెలిపారు.
లబ్ది పొందిన వారు కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాల పై ప్రభుత్వానికి ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంది. ఉచిత బస్సు ప్రయాణం వలన మహిళలకు నెలకు 2వేల వరకు మిగులుతుంది. 5 సంవత్సరాల లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్నో సమస్యలు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ నీ అమలు పరచి మాట నిలబెట్టుకున్నాం. 11,449 బస్సుల్లో 8,458 బస్సులు శ్రీ శక్తి పథకం ఉచితం కల్పించారు. శ్రీకాకుళం నుండి మంత్రాలయం,శ్రీశైలం వరకు ఉచిత ప్రయాణం చేయవచ్చు. ఆలయాల సందర్శన కోసం ఉచిత ప్రయాణం ఉపయోగ పడుతుంది. మహిళల ఆశీస్సులు ఉన్నంత వరకు కొండల నైనా పిండి చేస్తాం. ఒక్క రూపాయి కూడా ఎవరు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది ఓ అన్నగా నా ఆడబిడ్డలకు అందిస్తున్న కానుక. బస్సుల కోసం రియల్ టైమ్ ట్రాకింగ్ సిస్టమ్ తీసుకు వస్తున్నాం. మహిళల ఉచిత బస్సు ప్రయాణం పై ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఆర్టీసీ సిబ్బంది పై ఉంది. ఈ భారం ఆర్టీసీ పై పడకుండా ప్రత్యామ్నాయం పై దృష్టి సారిస్తున్నాం. కార్గో పై ఆర్టీసీ స్థలాల కమర్షియల్ పై దృష్టి సారిస్తున్నాం. ఇక పై ఏసీ ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేస్తాం. ఆటో డ్రైవర్ల కు కూడా ప్రత్యామ్నాయ పై దృష్టి సారిస్తున్నాం. వారి సమస్యల పరిష్కారం కోసం క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాం...అని సీఎం పేర్కొన్నారు.