పల్నాడు జిల్లాలోని పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెంటాల, పాకాలపాడు, దూళిపాళ్ల గ్రామాల్లో పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఎన్నికల సంఘం వెంటనే పరిస్థితిని అదుపు చేయాలని పోలీసులను ఆదేశించింది. అవసరమైతే కేంద్ర బలగాలను తరలించాలని సూచించింది. రెంటాడలో పోలింగ్ నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది.
రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఏజెంట్లు, మరో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు గొడవల్లో గాయాలయ్యాయని చెబుతున్నారు. వైసీపీ నేతలు కూడా తమ మీద టీడీపీ వర్గీయులు దాడులకు తెగబడ్డారని ఆరోపిస్తూ ఉన్నారు. టీడీపీ నేతల దాడుల్లో పలువురికి గాయాలయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు అక్కడి పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టారు.