మళ్లీ పొలిటికల్ గా కామెంట్స్ చేసిన సినీ నటుడు అలీ

Cine Actor Ali Key Comments on Ys Jagan Ruling. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అద్భుతమైన పాలనను అందిస్తున్నారని సినీ నటుడు

By Medi Samrat
Published on : 13 Jun 2022 4:00 PM IST

మళ్లీ పొలిటికల్ గా కామెంట్స్ చేసిన సినీ నటుడు అలీ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అద్భుతమైన పాలనను అందిస్తున్నారని సినీ నటుడు, వైసీపీ నేత అలీ కొనియాడారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. అవినీతికి తావు లేకుండా ప్రజల వద్దకే సంక్షేమ పాలనను అందించిన ఘనత జగన్ కే దక్కుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైపీసీనే అని ధీమా వ్యక్తం చేశారు.

ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో వైసీపీ ప్రవాసాంధ్రులు నిర్వహించిన మహా గర్జనలో అలీ ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ ఆస్ట్రేలియా కోఆర్డినేటర్ చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.










Next Story