22న ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 22వ తేదీ ఢిల్లీ వెళ్ల‌నున్నారు.

By Medi Samrat
Published on : 20 May 2025 2:32 PM IST

22న ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 22వ తేదీ ఢిల్లీ వెళ్ల‌నున్నారు. 23వ తేదీ పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. అదే విధంగా రాష్ట్రానికి పెట్టుబడులకు సంబంధించి పలువురు పారిశ్రామిక వేత్తలతో కూడా సీఎం భేటీ అవ్వనున్నారు. 24వ తేదీ ఉదయం 9.30 గంటలకు భారత్ మండపంలో జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం పాల్గొంటారు. అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణమై అమరావతి చేరుకుంటారు.

Next Story