ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ఆయన..

By Medi Samrat
Published on : 17 July 2024 7:15 PM IST

ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ఆయన.. రాత్రి కేంద్ర హోమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి అమిత్ షాకు చంద్రబాబు వివరించారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని చంద్రబాబు తెలిపారు. ఇక బుధవారం ఉదయం సీఎం అధికారిక నివాసం(1, జన్‌పథ్)లో పూజలు నిర్వహించారు. జన్‌పథ్ నివాసంలో చంద్రబాబును బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కలిశారు. ఆ తర్వాత విజయవాడకు చంద్రబాబు తిరుగు ప్రయాణమయ్యారు.

అమిత్ షాను కలిసిన చంద్రబాబు.. రాష్ట్ర ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి రాబోయే కేంద్ర బడ్జెట్‌లో గణనీయమైన నిధులు కేటాయించాలని కోరారు. అమిత్‌ షా నివాసంలో జరిగిన సమావేశంలో 2014లో జరిగిన “అన్యాయమైన విభజన”, గత 5 సంవత్సరాల పాలన అనంతర పరిణామాలను ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉందని తెలిపారు.

Next Story