ఏసీబీ కోర్టును ఆశ్రయించిన చంద్రబాబు కుటుంబసభ్యులు
చంద్రబాబు ఆరోగ్యం చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. జైలులో ఆయన ఆరోగ్యం క్షీణించిందని..
By Medi Samrat Published on 16 Oct 2023 7:30 PM ISTచంద్రబాబు ఆరోగ్యం చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. జైలులో ఆయన ఆరోగ్యం క్షీణించిందని చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉండగా.. ఆయన ఆరోగ్యం బాగుందని చిన్న ఇన్ఫెక్షన్ మాత్రమే వచ్చిందని జైలు అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేతను సీఐడీ గత నెలలో అరెస్ట్ చేసి.. రాజమహేంద్రవరం కేంద్రకారాగారానికి తరలించిన విషయం తెలిసిందే.
అయితే చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి నివేదిక అందించలేదంటూ ఆయన కుటుంబ సభ్యులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నివేదిక ఇవ్వలేదని చెబుతున్నారు. ఆరోగ్య నివేదిక కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. తమకు ఫిజికల్ డాక్యుమెంట్ అందలేదని తెలిపారు. 12వ తేదీ తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల నివేదిక ఇంకా ఇవ్వలేదని తెలిపారు. అధికారులు చెప్పిన అంశాలతోనే హెల్త్ బులెటిన్ ఇస్తున్నారని వారు కోర్టుకు తెలిపారు. చంద్రబాబుకు చల్లని వాతావరణం కల్పించాలన్న సూచనలను దాచిపెట్టారని మండిపడుతున్నారు చంద్రబాబు కుటుంబ సభ్యులు. వైద్యుల సూచనలు దాచిపెట్టి 4 రోజుల క్రితం హెల్త్ బులిటెన్ ఇచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సమగ్ర హెల్త్ బులిటెన్, వైద్య నివేదిక ఇవ్వకపోవడంపై పార్టీ నేతల్లో అనుమానాలు ఉన్నాయని చెబుతున్నారు.