తెలుగు ప్రజలకు చంద్రబాబు లేఖ..!

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.

By Medi Samrat  Published on  22 Oct 2023 5:42 PM IST
తెలుగు ప్రజలకు చంద్రబాబు లేఖ..!

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయన జైలు నుంచి బహిరంగ లేఖ రాశారని టీడీపీ ట్విట్టర్ హేండిల్ లో ఓ లేక పోస్ట్ చేశారు. లేఖలో.. తాను జైల్లో లేనని ప్రజల హృదయాల్లో ఉన్నానని.. ప్రజల నుంచి తనను ఒక్క క్షణం కూడా ఎవరూ దూరం చేయలేరని లేఖలో పేర్కొన్నారు. తన విలువలు, విశ్వసనీయతను ఎవ్వరూ చెరిపేయలేరన్నారు. ఆలస్యమైనా న్యాయం గెలుస్తుందని.. త్వరలోనే బయటకు వస్తానన్నారు. ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తానని చంద్రబాబు పేర్కొన్నట్టుగా లేఖలో ఉంది.


‘నేను జైలులో లేను.. ప్రజ‌ల హృద‌యాల్లో ఉన్నాను. ప్రజ‌ల నుంచి న‌న్ను ఒక్క క్షణం కూడా ఎవ్వరూ దూరం చేయ‌లేరు. 45 ఏళ్లుగా నేను కాపాడుకుంటూ వ‌స్తున్న విలువ‌లు, విశ్వస‌నీయ‌త‌ను ఎవరూ చెరిపేయ‌లేరు. ఆల‌స్యమైనా న్యాయం గెలుస్తుంది.. నేను త్వర‌లో బ‌య‌ట‌కొస్తాను. ప్రజ‌ల కోసం, రాష్ట్ర ప్రగ‌తి కోసం రెట్టించిన ఉత్సాహంతో ప‌నిచేస్తాను. ఓట‌మి భయంతో జైలు గోడ‌ల మ‌ధ్య బంధించి ప్రజ‌ల‌కు న‌న్ను దూరం చేశామ‌నుకుంటున్నారు. నేను ప్రస్తుతం ప్రజ‌ల మ‌ధ్యలో లేక‌పోవ‌చ్చు.. అభివృద్ధి రూపంలో ప్రతీ చోటా క‌నిపిస్తాను. సంక్షేమం పేరు వినిపించిన ప్రతీసారి నా పేరే త‌లుస్తారు. తెలుగు ప్రజలంద‌రికీ ద‌స‌రా శుభాకాంక్షలు’ అని లేఖలో చెప్పుకొచ్చారు. ఈ లేఖ విషయమై జైలు అధికారులు స్పందించాల్సి వుంది.


Next Story