రేపు ప్రధానితో చంద్రబాబు భేటీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బ‌య‌ల్దేరారు. జులై 4న ఉ.10.15 గంటలకు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.

By Medi Samrat  Published on  3 July 2024 8:00 PM IST
రేపు ప్రధానితో చంద్రబాబు భేటీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బ‌య‌ల్దేరారు. జులై 4న ఉ.10.15 గంటలకు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలను వివరించనున్నారు. మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలతో భేటీ అవుతారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం, పారిశ్రామిక రాయితీలు వంటి వాటిపై కేంద్రం సహాయం కోరనున్నారు. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బాబు నివేదిక ఇవ్వనున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు.

Next Story