ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం.. ఉదయం 10.15 గంటలకు సచివాలయానికి వెళ్తారు. 10.30 గంటలకు కేబినెట్ భేటీలో పాల్గొంటారు. మధ్యాహ్నం 03.00 గంటలకు గ్రీన్ కవర్‌పై సమీక్ష చేస్తారు. 04.00 గంటలకు రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టు పనులపై సమీక్షిస్తారు. సాయంత్రం 06.45 గంటలకు నివాసానికి చేరుకుంటారు.
ఇదిలావుంటే.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ రోజు ఢిల్లీ పర్యనటనలో బిజీగా ఉండనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమవుతారు. పలు పెండింగ్ ప్రాజెక్ట్స్ అంశాలతోపాటు రాష్ట్రాభివృద్ధికి సంబంధించినవాటితోపాటు కీలక విషయాలపై చర్చించనున్నారు.