ఢిల్లీకి చంద్రబాబు నాయుడు.. అందుకోసమే..!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీలో బీజేపీ నేతలతో చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారని తెలుస్తోంది.

By Medi Samrat  Published on  6 Feb 2024 5:42 PM IST
ఢిల్లీకి చంద్రబాబు నాయుడు.. అందుకోసమే..!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీలో బీజేపీ నేతలతో చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు వెంట జనసేనాని పవన్ కళ్యాణ్ వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పార్టీల మధ్య పొత్తుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ, జనసేనలు పొత్తు పెట్టుకుని, కలిసి పని చేస్తున్నాయి. జనసేనతో తమ పార్టీ పొత్తులోనే ఉందని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.

ఇక ఉమ్మడి మ్యానిఫెస్టోపైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించాల్సి ఉంది. ఇక ఈ రెండు పార్టీలకు సంబంధించి సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన ఎప్పుడెప్పుడా అని నేతలు ఎదురు చూస్తున్నారు. అధికార వైసీపీ ఇప్పటికే జాబితాలను ప్రకటిస్తోంది. తెలుగుదేశం – జనసేన ఉమ్మడి జాబితాపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కొందరు నేతలు త్యాగాలకు సిద్ధం కావాలని ఇరు పార్టీల అధినేతలు నేతలకు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఇక బీజేపీతో పొత్తు పెట్టుకుంటే సమీకరణాలు ఎలా మారుతాయో చూడాలి.

Next Story