Video : సింగపూర్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి బయల్దేరిన చంద్రబాబు

సింగపూర్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి బయల్దేరారు.

By Medi Samrat
Published on : 30 July 2025 4:35 PM IST

Video : సింగపూర్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి బయల్దేరిన చంద్రబాబు

సింగపూర్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి బయల్దేరారు. నాలుగు రోజుల పర్య‌ట‌న‌లో ముఖ్యమంత్రి 26 సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గోన్నారు. పర్యటన ముగించుకుని ఏపీకి బయల్దేరిన సీఎం చంద్రబాబుకు సింగపూర్‌లోని తెలుగు ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. సీఎం ఏపీకి బయల్దేరుతున్నారని తెలిసి ఆయన బసచేసిన హోటల్ కు సింగపూర్ లోని తెలుగు ప్రజలు తరలి వచ్చారు. వీడ్కోలు పలికే సమయంలో జై సీబీఎన్ అంటూ స్థానిక తెలుగు ప్రజలు నినాదాలు చేశారు. సింగపూర్‌లోని తెలుగు ప్రజల అభిమానానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. సింగపూర్ లోని తెలుగు ప్రజల అత్మీయ స్వాగతం, ప్రేమాభిమానాలు మరువలేనని సీఎం వ్యాఖ్యానించారు. సింగపూర్ నుంచి రాత్రి 10.30 గంటలకు ముఖ్యమంత్రి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెంటనే సీఎం చంద్రబాబు విజయవాడ బయల్దేరి రానున్నారు. రాత్రి 11.30 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు.


Next Story